
ఇంటర్నెట్‌డెస్క్‌: చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా... అనేది ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ రూపొందిన చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ వార్త చదివారా: ‘మండాడి’ రూ.65 కోట్ల కలెక్షన్స్‌.. జాక్‌పాట్‌ కొట్టిన నిర్మాత!