
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ముమ్మిడివరం, న్యూస్‌టుడే: రాత్రి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడి, చాకుతో బెదిరించి, బంగారు గొలుసు అపహరించుకుపోయిన ఘటన ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ఠాణేలంక పంచాయతీ శివారు వడ్డిగూడేనికి చెందిన పితాని నాగదుర్గ భర్త మృతిచెందడంతో తల్లిదండ్రులు వద్ద ఉంటున్నారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చి నాగదుర్గను చాకుతో బెదిరించి ఆమె మెడలోని రెండున్నరకాసుల గొలుసు అపహరించుకుపోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్, ఎస్సై బి.శివకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వేలిముద్రల నిపుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకృష్ణ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





