
మద్యం దుకాణాల వద్ద ఇబ్బందులు న్యూస్‌టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం), ధవళేశ్వరం దానవాయిపేటలో ఓ బార్‌ వద్ద రోడ్డుపైనే వాహనాలు ఆ దారిన వెళ్లాలంటే జనాలకు దడే.. మద్యం దుకాణాల వద్ద రోడ్లపై వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రమైతే పరిస్థితి దారుణంగా మారుతోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం ప్రాంతాల్లో ఈ తీరు మారీ దారుణంగా ఉంటోంది. మద్యం దుకాణాలు, బార్ల వద్ద రోడ్లను ఆక్రమించి వాహనాలు పెట్టేస్తుండడంతో ట్రాఫిక్‌కు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం పరిధిలో మొత్తం 46 మద్యం దుకాణాలు, 14 బార్లు ఉన్నాయి. చాలా దుకాణాలు ప్రధాన రహదారులకు చేర్చి ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఉన్న మద్యం దుకాణం వద్ద పార్కింగ్‌ లేదు. ఎదురుగా హోటల్, పక్కనే పాన్‌షాపు ఉండడం, దానవాయిపేటకు ప్రధాన రహదారి కావడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. మరోవైపు బార్‌ వద్ద కూడా అదే పరిస్థితి. సాయంత్రం ఆరు నుంచే మద్యం దుకాణాల వద్ద ఈ పరిస్థితి ఉంటోంది. దుకాణ యాజమాన్యాలు సైతం కనీస చర్యలు చేపట్టడం లేదు. పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసుకుంటే కొంత సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆయా దుకాణాలపై పోలీసు పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉంటోంది. మద్యం దుకాణాలు, బార్ల వద్ద గస్తీ పెంచాలని ప్రజులు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





