
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ అత్యధిక మరణాలకు కారణమవుతుంది. ఈ క్యాన్సర్‌ను ప్రా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ అత్యధిక మరణాలకు కారణమవుతుంది. ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ముదిరిన దశలో చికిత్సలు పరిమితమవుతాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, ధూమపానం వంటి ప్రమాదకర అలవాట్లను దూరం ఉంచడం చాలా అవసరం. నిపుణులు సూచిస్తున్నట్లుగా, కొన్ని సాధారణ రోజువారీ అలవాట్లు కూడా ఊపిరిత్తుల క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఈ అలవాట్లను మనం పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కాలక్రమేణా ప్రమాదం పెరుగుతుంది. ఉదాహరణకు, రోజుకు కొన్ని సిగరెట్లు మాత్రమే తాగడం కూడా ప్రమాదకరమైనది. పొగాకు పొగలో ఉన్న రసాయనాలు, కణాలు ఊపిరిత్తుల కణాలను దెబ్బతీయడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. సిగరెట్లు తాగడం మానేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సెకండ్-హ్యాండ్ పొగను పీల్చడం కూడా ప్రమాదకరమైనది. ధూమపానం చేయని వారు కూడా ఇతరుల పొగను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను పొందుతారు. ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కొద్దిసేపు మాత్రమే పొగ పీల్చినా, అది ఊపిరిత్తులకు తీవ్ర హానిని కలిగిస్తుంది. అలాగే, వెంటిలేషన్ లేని వంటగదుల్లో వంట చేయడం కూడా ప్రమాదకరమైనది. అధిక వేడితో వంట చేయడం, మరిగించిన నూనెలను వాడడం వల్ల వంటగదిలో ప్రమాదకరమైన పొగ, ఆవిరి ఏర్పడుతుంది. ఈ సూక్ష్మకణాలను ప్రతిరోజూ పీల్చడం వల్ల ఊపిరిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి.