
Cotton Msp Increased To Rs 8 667 Per Quintal For 2026 27 Season Farmers Seek Cci Procurement 1551779
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది.
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది.
సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం
జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు.
అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్‌కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలి.
జమ్మికుంట మార్కెట్లో 4.15లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో 2025-26 సంవత్సరంలో సీసీఐ 10వేల 666మంది రైతుల నుంచి 1.46లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. గతేడాది మద్దతు ధర రూ.8,110గా ఉంది. ప్రైవేట్ వ్యాపారులు 15వేల మంది రైతుల నుంచి 2.69లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేపట్టారు. ఆ సమయంలో ప్రైవేట్ వ్యాపారులు ఏడు వేల రూపాయల నుంచి 7,500వరకు మాత్రమే ధర చెల్లించారు. అప్పటి మద్దతు ధర 8,110 రూపాయల ప్రకారం 2.69లక్షల క్వింటాళ్లకు రూ.218కోట్ల 15లక్షలు రైతులకు దక్కాల్సి ఉంది. అవరేజ్ ధర 7,500 రూపాయల ప్రకారం చూస్తే రూ.201కోట్ల 75 లక్షలు మాత్రమే వారికి దక్కాయి. మద్దతు ధర ప్రకారం రూ.16కోట్ల 40లక్షలు రైతులకు అందా ల్సి ఉండగా, నాణ్యత పేరుతో కోతల రూపంలో నష్టపోవాల్సి వచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా 25న..
Read Latest AP News And Telangana News And International News And Telugu News





