
Stainless Steel Water Bottle Cleaning Tips Telugu: స్కూల్, కాలేజీ, ఆఫీస్ లేదా ప్రయాణాల సమయంలో చాలామంది వాటర్ బాటిళ్లను వెంట తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్ల వినియోగం బాగా పెరిగింది. వీటిలో నీటితో పాటు టీ, కాఫీ వంటి వేడి పానీయాలు, చల్లని పానీయాలను కూడా నిల్వ చేసుకోవచ్చు. అయితే బాటిల్‌ను తరచూ ఉపయోగిస్తూ సరైన విధంగా శుభ్రం చేయకపోతే అడుగుభాగంలో మరకలు, పానీయాల అవశేషాలు, దుర్వాసన పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాటిల్ మూత, రబ్బర్ సీల్, మూతలోని చిన్న గీతల్లో మురికి, తేమ చేరవచ్చు. అందుకే స్టీల్ వాటర్ బాటిల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో బాటిల్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.