
ప్రతి వ్యక్తి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఇంటిని నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి వ్యక్తి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఇంటిని నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇసుక, సిమెంట్, ఇటుక వంటి ప్రతి వస్తువును జాగ్రత్తగా ఎంచుకుంటారు. అయితే, ఇంటి నిర్మాణ సామగ్రి మాత్రమే కాదు, ఇంటికి వేసే రంగుల నాణ్యతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిపుణులు చెబుతున్నట్లుగా, మంచి రంగులు ఉపయోగిస్తే వర్షాలు, తడి, మంచు, దుమ్ము, ధూళి వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ అంశంపై అవగాహన ఉంటే ఇంటిని దశాబ్దాల పాటు భద్రంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. అందువల్ల, పెయింటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. ఇంటి యజమానులు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లలో గోడల రంగులు పెచ్చులూడిపోవడం ఒకటి. తేమ, చెమ్మ కారణంగా గోడలపై మచ్చలు ఏర్పడతాయి, క్రమంగా రంగు పొర గుల్లబారి పోతుంది. మరమ్మతు చేయించినా మళ్లీ ఆ ప్రాంతంలో రంగు పెచ్చులూడడం జరుగుతుంది. బాహ్య గోడల్లోకి నీరు ఇంకిపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. నాసిరకం రంగులు వేస్తే, గోడల లోపలి భాగం కూడా దెబ్బతింటుంది. నీటిని గోడల అంతర్భాగాల్లోకి ఇంకకుండా చేసే గుణం సాధారణ రంగులకు ఉండదు. క్రమంగా గోడల్లో చెమ్మ చేరుతుంది, ఇది గోడలను బలహీనపరచడమే కాకుండా, వేసిన రంగులు కూడా త్వరగా వెలిసిపోతాయి. గోడల్లోకి నీరు ఇంకకుండా చేయగలిగితే అవి బలంగా ఉండటంతో పాటు, వాటికున్న రంగులు కూడా సంవత్సరాల పాటు కాంతులీనుతూ కనిపిస్తాయి.