మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ నివాసంలో 'ఇరుముడి' చిత్రబృందానికి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చి ఘనంగా అభినందించారు.
ఈ ప్రత్యేక భేటీలో హీరో రవితేజతో పాటు ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ, ఇతర ప్రధాన సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. సినిమా సాధించిన విజయానికి మెగా తండ్రీకొడుకులు ఇద్దరూ చిత్రయూనిట్‌ను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కొంత సమయం గడిపి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
అంతకుముందే సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి, ఇప్పుడు నేరుగా యూనిట్‌ను కలవడం టాలీవుడ్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో 'త్రినాథ్' పాత్రలో రవితేజ జీవించాడని, తన అద్భుత నటనతో సినిమాను ముందుండి నడిపించాడంటూ మెగాస్టార్ ప్రత్యేకంగా కొనియాడారు.
దర్శకుడు శివ నిర్వాణ ఎంతో ఎమోషనల్ మైండ్ సెట్‌తో కథను ఎమోషనల్‌గా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని, సినిమాలో నటించిన చిన్నారి నక్షత్ర నటన ప్రతి ఒక్కరినీ మెప్పించిందని చిరు ప్రశంసించారు. పరిశ్రమలో ఒక మంచి సినిమా విజయం సాధిస్తే అది అందరికీ పండుగలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
రవితేజ, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సృష్టించిన సంచలనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రపోతోనే చిరు మరోసారి తన 'తమ్ముడు' రవితేజ విజయాన్ని తన సొంత విజయంగా భావించి సత్కరించడం గమనార్హం.
ఈ సక్సెస్ మీట్‌కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ మరియు మాస్ మహారాజాలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కాంబో మళ్లీ రిపీట్ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న 'ఇరుముడి' త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు కూడా సిద్ధమవుతుండటంతో, ఓటీటీ వేదికగా ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాకా ధూమ్ ధమాకా: క్రేజీ కళ్యాణం సాంగ్ రిలీజ్.. అనుపమ మాస్ స్టెప్పులు.!
కాకా ధూమ్ ధమాకా: క్రేజీ కళ్యాణం సాంగ్ రిలీజ్.. అనుపమ మాస్ స్టెప్పులు.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.



