
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల నగదు సాయం అందిస్తోంది. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ ద్వారా రైతుల పంటలకు బీమా సౌకర్యం అందిస్తోంది. ఇక ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్లపై సబ్సిడీ, పొలాల్లో సొలార్ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీలు వంటివి అందిస్తోంది. అయితే ఇవే కాదు.. రైతులకు కేంద్రం పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. వృద్దాప్యంలో రైతులు పని చేయలేరు. దీంతో వారికి ఎలాంటి స్థిరమైన ఆదాయం ఉండకపోవంతో ఆర్ధిక భరోసా ఉండదు. దీంతో వృద్దాప్యంలో రైతులకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు పెన్షన్ సదుపాయం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ థన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీములో ఎలా చేరాలి..? ఎవరెవరు అర్హులు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.