
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఒకవైపు కంటెంట్‌తో మెప్పిస్తూనే.. మరోవైపు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయి మలయాళ చిత్రాలు. నివిన్ పాలి, మమితా బైజు (Mamitha Baiju) జంటగా నటించిన బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ (Bethlehem Kudumba Unit) రూ.300 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది అగ్రస్థానంలో నిలిచింది. భారీ స్టార్‌డమ్ మీద ఆధారపడకుండా బలమైన కంటెంట్, మౌత్ టాక్, నటీనటుల అద్భుత ప్రదర్శనతో ఈ చిత్రం అంత గొప్ప విజయాన్ని అందుకుంది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. సుమారు 1,120 శాతం (రూ.280 కోట్లు) లాభపడి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల జాబితాలో ఇప్పటివరకూ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లోకా ఛాప్టర్ వన్: చంద్ర’ (Lokah Chapter One: Chandra) ( రూ.301.41 కోట్లు) ఉండగా, ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. మలయాళంలో ఓ మహిళా ప్రధాన చిత్రం ఈ స్థాయిలో భారీ వసూళ్లు సాధించడం విశేషం. ఆ తర్వాత మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘ఎల్‌2: ఎంపురాన్‌’ రూ.268 కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలివే! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంటర్నెట్‌ డెస్క్: ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. తారల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది. ఆ ఫొటోలు మీకోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటోన్న జీవీ ప్రకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’.