

- తెలంగాణలో భారీ వర్ష సూచన
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్‌లో వానల పండుగ వాతావరణం
Telangana Rain: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు(Telangana Rain) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Saifabad Police: కేటీఆర్ పీఆర్వో, పీఏలపై దాడి? విచారణకు హరీశ్ రావు డిమాండ్.. ఖండించిన పోలీసులు!
హైదరాబాద్‌పై వర్ష ప్రభావం.. పిడుగుల హెచ్చరిక:
రాజధాని హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈదురు గాలుల వీచే అవకాశం ఉన్నందున నగర వాసులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదని ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరించారు.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ:
రాష్ట్రంలోని పలు ఉత్తర, తూర్పు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలను యంత్రాంగం అప్రమత్తం చేసింది. రైతులు కూడా తమ పంట దిగుబడులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.