
అంతరిక్షంలో వ్యోమగాములు కాసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ సరదా ఆట సాగింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. వ్యోమగాములు మైక్రో గ్రావిటీలో తేలియాడుతూ బంతినిగోల్‌ కొడుతూ కనిపించారు. భూమిపైన ఆడే విధంగా పరిగెత్తాల్సిన అవసరం లేకపోవడంతో ఆట తీరు ప్రత్యేకంగా కనిపించింది. అంతరిక్షంలో ఫుట్‌బాల్‌ ఆడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ⇒ వీడియో