
Asia Cup 2026: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించి టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఛాంపియన్‌గా అవతరించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేసే సమయమే అసలు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు స్పష్టంగా అభ్యంతరం తెలిపింది. సరిగ్గా ఇదే తరహాలో 2025 సెప్టెంబర్‌లో జరిగిన పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత నాటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.





