
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగార్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని 20 విభిన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 892 పోస్టుల భర్తీకి అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే కీలకమైన గ్రూప్-1 సర్వీసులలో 163 పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు నిబంధనలు పరిశీలించి అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గ్రూప్-1 సర్వీసులు (163 పోస్టులు): 11 డిప్యూటీ కలెక్టర్లు, 36 డీఎస్పీ (సివిల్), 3డీఎస్పీ (కమ్యూనికేషన్స్), 14 టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 35 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (DDO), 15 డిప్యూటీ రిజిస్ట్రార్లు, 12 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, 14 డిస్ట్రిక్ట్/డివిజనల్ ఫైర్ ఆఫీసర్లు, 14 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ల పోస్టులతో పాటు ఇతర ఉన్నత పోస్టులు ఉన్నాయి. ఇతర ముఖ్య శాఖల్లో ఖాళీలు: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు (196), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (73), హార్టికల్చర్ ఆఫీసర్లు (37), పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ గ్రేడ్-2 (18), ఏపీ అసెంబ్లీ రిపోర్టర్లు (11), ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర పోస్టులు భర్తీ కానున్నాయి. దరఖాస్తు గడువు .. ముఖ్య సమాచారం: గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6 నుండి ప్రారంభమై అక్టోబర్ 27 వరకు కొనసాగనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిబంధనలు, విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకుని గడువులోగా అప్లై చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.