
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌. చిత్రంలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ ఈనాడు, అమరావతి: కాలానికి అనుగుణంగా వైద్యవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతోపాటు పరిశోధనలకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ స్పష్టంచేశారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విద్యా కార్యక్రమాలు, ప్రవేశాలు, పరిశోధనలు, ప్రచురణలు, అభివృద్ధి తదితర అంశాలపై బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యవిద్యలో కృత్రిమ మేధ, డిజిటల్‌ హెల్త్, హెల్త్‌కేర్‌ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజినీరింగ్, మెడికల్‌ డివైజెస్‌ వంటి నూతన విభాగాలకు ప్రాధాన్యమిస్తూ ఉమ్మడి పరిశోధనలపై దృష్టిసారించాలని సూచించారు. వీసీ పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతో కలిసి పరస్పర సహకారంతో వర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్య విద్య ప్రవేశాలు, పరిపాలన కార్యక్రమాల తీరును రిజిస్ట్రార్‌ సాయి సుధీర్‌ వివరించారు. విశ్వవిద్యాలయం 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ‘రూబీ జూబ్లీ’ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





