
యువత: మ్యాచ్‌కు అయిదు నిమిషాల ముందు కనీస వామప్‌ అలవరచుకోవాలి. లేకుంటే ఎముకలు, కీళ్లు విరిగిపోవచ్చు. మధ్య వయస్కులు: 5 నిమిషాలు నెమ్మదిగా నడకతో మొదలెట్టి తర్వాత చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. నొప్పి, వాపు ఉంటే ఆటకు విరామం ఇవ్వాలి. అకస్మాత్తుగా వేగం పెంచొద్దు. వారంతాల్లో.. అడేవారు: వారం మొత్తం కూర్చొని.. వారాంతంలో తీవ్రంగా ఆడితే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం. 15 నిమిషాల వామప్‌ అవసరం. ఆట తర్వాత రిలాక్స్‌ అవ్వాలి. సమతుల సాధన అవసరం.. - డా.రవిచంద్ర వట్టిపల్లి, ఆర్థోపెడిక్‌ సర్జన్, విశాఖ చాలా గాయాలు బలంగా ఆడినందుకు కాదు..వామప్‌ లేకుండా ఆడినందుకే అవుతాయి. తీరిక లేకపోతే ఆట సమయాన్ని తగ్గించుకోనైనా వామప్‌ చేయాలి. కొంత వ్యాయామం, నడక, తేలికపాటి బల వ్యాయామాలకు సమతుల సాధన అవసరం. వారం మొత్తం నిశ్చలంగా ఉండి శనివారం మాత్రమే పూర్తి వేగంతో ఆడితే శరీరం అకస్మాత్తుగా వచ్చే ఒత్తిడిని భరించలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.