
కమలానగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. అనంతపురంలోని ఓ హోటల్‌లో తెదేపా జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెస్ రాజుతో పాటు జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు నినాదాలతో ప్రజల్లోకి తీసుకువెళ్లి కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దుర్మార్గపు చర్యలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండేళ్లలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని, వాటిని ప్రజలకు వివరిస్తూ అన్ని స్థానాల్లో గెలుపు సాధిస్తామన్నారు. మూడు పార్టీల జెండాలు ఎగరవేసి మున్సిపల్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కచ్చితంగా గెలుపు సాధిస్తామని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.