
చమురు ధరలే కీలకం మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ఎక్కువ కదలికలు సిమెంటు, ఎఫ్‌ఎమ్‌సీజీకి ప్రతికూలతలు లోహ షేర్లు రాణించొచ్చు విశ్లేషకుల అంచనా నేడు మార్కెట్లకు వినాయకచవితి సెలవు స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ముడి చమురు అధిక ధరల నేపథ్యంలో స్వల్పకాలంలో సూచీలు స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల పరిణామాలనూ గమనించాలి. రాబోయే రోజుల్లో ఎంపిక చేసిన మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ఎక్కువ ట్రేడింగ్‌ జరగొచ్చని చెబుతున్నారు. ‘బ్యారెల్‌ ముడి చమురు ధర పెరిగిన ప్రతి 10 డాలర్లకూ, మన దేశ దిగుమతి బిల్లుపై ఏటా 13-14 బిలియన్‌ డాలర్ల భారం పడుతుంది. ఇది రిటెయిల్‌ ద్రవ్యోల్బణాన్ని 30-50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతుంది. కాబట్టి చమురు సంబంధిత రంగాల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుంద’ని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా వడ్డీరేట్ల నిర్ణయం వంటివీ సూచీలపై ప్రభావం చూపుతాయి. ఈనెలలో ఇప్పటివరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు రూ.13,138 కోట్లు ఉపసంహరించారు. వీరి ధోరణీ కీలకమే. నిఫ్టీ-50కి 23,250-23,230 కీలక మద్దతు స్థాయి అన్నది సాంకేతిక నిపుణుల అంచనా. 23,230 దిగువన విక్రయాల ఒత్తిడి పెరగొచ్చు. పైకి వెళ్తే 23,600-23,620 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. వినాయకచవితి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు కావడంతో, ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితమవుతున్న ఈ వారంలో వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




