
ఈనాడు, అమరావతి: విజయవాడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వినాయకుడి మట్టి విగ్రహం ప్రపంచ రికార్డు సాధించింది. డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని విద్యాధరపురం సితార గ్రౌండ్స్‌లో 72 అడుగుల ఎత్తయిన శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం ఎత్తయిన పర్యావరణ హిత గణేశుడిగా.. ఇంజీనియస్‌ ఛార్మ్‌ వరల్డ్‌ రికార్డ్‌ (ఐసీడబ్ల్యూఆర్‌) సాధించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) చేతుల మీదుగా ఈ రికార్డును నిర్వాహకులకు బుధవారం అందజేశారు. ఈ మట్టి విగ్రహాన్ని నిలబెట్టినచోటే నిమజ్జనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమితి వ్యవస్థాపకుడు రాకేష్‌ వెల్లడించారు. ఎంపీ శివనాథ్‌ చేతుల మీదుగా రికార్డు అందుకుంటున్న డూండీ గణేశ సేవా సమితి ప్రతినిధులు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.