
సీసీ కెమెరాల సరఫరా టెండరు నిబంధనలపై అనుమానాలు కేంద్రం నిషేధించిన చైనా కంపెనీ ఉత్పత్తిని చేర్చిన అధికారులు ఈనాడు, అమరావతి ఇం ద్రకీలాద్రిపై నిఘాను పటిష్టం చేసేందుకు ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి సరఫరాకు పిలిచిన టెండర్లలోని పలు అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కొందరికి మేలు చేసేందుకే పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను గాలికొదిలేసి మరీ టెండర్లు పిలిచారు. దీని వల్ల ఆలయ, భక్తులకు సంబంధించిన భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. దు ర్గమ్మ ఆలయంలో ఏర్పాటు చేసేందుకు సీసీ కెమెరాలు, ఇతర పరికరాల సరఫరాకు ఇటీవల రూ.20.42లక్షలతో టెండర్లు పిలిచారు. 5 పీటీజడ్, 5 ఎన్వీఆర్‌ (నెట్‌వర్క్‌ వీడియో రికార్డర్‌), 15 డోమ్‌ కెమెరాలు, 45 బుల్లెట్‌ కెమెరాలు, 20 పీవోఈ స్విచ్‌లు, భక్తులను లెక్కించే 4 కెమెరాలు, 64 ఛానల్‌ ఎన్వీఆర్‌ల కోసం టెండర్లు పిలిచారు. టెండర్‌ పత్రంలో నిర్ధిష్ట బ్రాండ్లు, మోడల్‌ నంబర్లను పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సీసీ టీవీ భద్రతా ప్రమాణాల నేపథ్యంలో ఎస్టీక్యూసీ/కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార మంత్రిత్వశాఖ ధ్రువీకరణ లేని పరికరాలను ప్రస్తావించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




