
రామకృష్ణాపూర్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, సీఐ పర్స రమేశ్‌తో కలిసి సీపీ బుధవారం ఆర్కేపీ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న పోలీసు సేవల గురించి ఆరా తీశారు. వివిధ నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచాలని ఎస్సై శ్రీధర్‌ను ఆదేశించారు. రిసెప్షన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, రికార్డులను సక్రమంగా అప్‌లోడ్‌ చేయడం వంటి అంశాలపై ఆరా తీశారు. గంజాయి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.