
ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌ అడిడాస్‌ (Adidas Layoffs) కూడా భారత్‌లో లేఆఫ్‌లు ప్రకటించింది. గురుగ్రామ్‌లోని టెక్‌ హబ్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులతోపాటు పలు విభాగాల ఇంజినీర్లను తొలగించేందుకు సిద్ధమైంది. లేఆఫ్‌ విషయాన్ని అడిడాస్‌ ధ్రువీకరించినప్పటికీ.. ఎంత మందిని తొలగిస్తోందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, దిల్లీ కార్యాలయంలో దాదాపు సగం మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్‌ గుడ్‌న్యూస్‌.. EPF వేతన పరిమితి పెంపు వ్యాపార అవసరాలకు అనుగుణంగా నిర్వహణ పద్ధతులను మార్చే ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో భాగంగానే తాజా చర్యలు తీసుకున్నట్లు అడిడాస్‌ పేర్కొంది. ఈ మార్పుల వేళ ప్రభావితమయ్యే ఉద్యోగులకు తగిన చేయూత అందిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కొందరిని తక్షణమే తొలగించగా.. మరికొందరు డిసెంబర్‌ చివరి వరకు కొనసాగుతారని చెప్పినట్లు సమాచారం. గురుగ్రామ్‌లోని అడిడాస్‌ టెక్‌ హబ్‌లో దాదాపు 700 మంది పనిచేస్తున్నట్లు అంచనా. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.