
Actress Poorna Emotional Post: నటి పూర్ణ (షామ్నా కాసిమ్) సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. తన 'షామ్నా కాసిమ్ డ్యాన్స్ స్టూడియో'లో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఒక చిన్నారి అకాల మరణం చెందడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ చిన్నారి తమ కుటుంబంలో ఒకరిగా నిలిచిపోయిందని, ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరని కన్నీటి నివాళి అర్పించారు. అయితే ఆ చిన్నారి మరణానికి గల కారణాన్ని పూర్ణ వెల్లడించలేదు.