
ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకుల్లో భారత ద్వయం అదరగొట్టేస్తోంది. ఇషాన్ కిషన్ (913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అభిషేక్ శర్మ (862) ఒక ప్లేస్‌ ముందుకొచ్చి రెండో ర్యాంకుకు చేరాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆటగాడు షహిబ్జాద ఫర్హాన్ (848)ను వెనక్కి నెట్టాడు. అఫ్గాన్‌తో రెండు టీ20ల్లో అభిషేక్ ( Abhishek Sharma ) హాఫ్‌ సెంచరీతో కలిపి 121 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (801) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. టెస్టుల్లో హ్యారీ బ్రూక్ (861)దే అగ్రస్థానం. అఫ్గాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడాక.. గాయపడి సిరీస్‌కి దూరమైన వరుణ్‌ చక్రవర్తి (678) బౌలింగ్‌ విభాగంలో ఐదో ప్లేస్‌కు చేరాడు. రెండు స్థానాలను మెరుగుపర్చుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (650) ఏడు స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు చేరాడు. టీ20 విభాగంలో రషీద్ ఖాన్ (744) అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లోనూ అతడిదే టాప్ ర్యాంక్. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సంజు శాంసన్‌ (57; 22 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.