
ప్రధాని మోదీని.. ఆయన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ కలిశారు. దశాబ్దాలుగా వివాదంలో చిక్కుకున్న భూమిపై సీబీఐ విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. వాద్ నగర్లో మోదీతో కలిసి చదువుకున్న అస్గర్ అలీ వోహ్రా.. 37 ఏళ్ల క్రితం కొన్న భూమిని నకిలీ పత్రాలతో బిల్డర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యేకు కూడా సంబంధం ఉందని పేర్కొన్నారు. 2015లో ఎఫ్ఐఆర్, 2026లో సీఐడీ నివేదిక సమర్పించిందని చెప్పారు.





