
Zomato: పెరుగుతున్న పోటీ మధ్య తన ఆదాయాన్ని పెంచుకోవడానికి, నిలదొక్కుకోవడానికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ (COD) ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే కస్టమర్ల నుండి ఈ కంపెనీ ఇప్పుడు అదనపు రుసుములను వసూలు చేయడం ప్రారంభించింది. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఎంపికను ఎంచుకునే కస్టమర్లు ఇప్పుడు రూ.5 నుండి రూ.20 వరకు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆన్లైన్లో చెల్లిస్తే ఈ ఛార్జీ వర్తించదు.




