
Golden Modak : వినాయక చవితికి నైవేద్యాలకు కొదవ ఉండదు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదక్‌లు.. ఇలా రకరకాల తినుబండారాలను ప్రేమతో సమర్పిస్తారు భక్తులు. అయితే.. వీటిలో చూడగానే నోరూరించే మోదక్ కాస్త ప్రత్యేకం. అందులోనూ ‘గోల్డెన్ మోదక్’ (Golden Modak) ఇంకా చాలా ప్రత్యేకం. బంగారంతో తయారయ్యే వీటి రుచే కాదు ధర కూడా గొప్పగానే ఉంటుంది. కానీ, గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి పసిడి మోదక్‌ల ధర భారీగానే పెరిగింది. కిలో రూ.270000 చొప్పున వీటిని అమ్ముతున్నారు. గణేశ్ ఉత్సవాల వేళ స్వామివారికి నైవేద్యంగా మోదక్‌లు ఉండాల్సిందే. గణనాథుడికి ప్రీతిపాత్రమైన ఈ తినుబండారాన్ని ఈమధ్య రకరకాల రుచులతో లొట్టలోయించేలా తయారుచేస్తున్నారు. గోల్డెన్ మోదక్‌లతో వినాయక చవితిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు కొందరు. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్లో ఉన్న ‘సాగర్ స్వీట్స్’ ఎప్పటిలానే ఈసారి గోల్డెన్ మోదక్‌లను అందుబాటులో ఉంచారు. A post shared by NDTV (@ndtv) స్వర్ణమయమైన వీటి ధర అనుకున్నట్టే ఆకాశం తాకేలా ఉంది. కిలో గోల్డెన్ మోదక్‌లను రూ.27 వేలకు అమ్ముతున్నారు. అయితే.. గత ఐదేళ్లతో పోల్చితే ఈసారి ధర ఎక్కువుందని చెబుతున్నారు. 2021లో కేజీ రూ.12 వేలు ఉండగా.. నిరుడు కిలో రూ.20 వేలకు విక్రయించారు. కానీ, ఈసారి ధరల పెరుగుదల కారణంగా మరో ఏడే వేలు పెంచారు. తినే బంగారంతో తయారైన ఈ మోదక్‌ల వీడిమో నెట్టింట వైరలవుతోంది.