హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా
Actor ProfileActor

హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా

Total News1
Movie Updates0
Sources1
హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా
Telugu Cinema15 Jun 2026
హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా

“2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు గారి ‘సింగ్ గీతం’ సినిమాలో అవకాశం వచ్చింది. నాగ్ అశ్విన్ నాకు మళ్లీ జీవితాన్ని ఇచ్చారు. లేకపోతే ఇప్పటికి నేను హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని” అని హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన “సింగ్ గీతం” (Singh Geetham) విజయోత్సవ వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన “సింగ్ గీతం” విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ పోషించిన కీలక పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె పాత్ర బాగా పండింది అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది ఆమెను ఈ చిత్రానికి “సీన్ స్టీలర్”గా అభివర్ణిస్తున్నారు. గత కొంతకాలంగా నివేదా పేతురాజ్ వ్యక్తిగతంగా పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం రద్దయినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తమిళనాడులో రాజకీయ వివాదాల్లో కూడా ఆమె పేరు వినిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమాలకు దూరమవుతారనే ప్రచారం జరిగింది. అయితే “సింగ్ గీతం” విజయంతో నివేదా పేతురాజ్ మళ్లీ లైంలైట్ లోకి వచ్చినట్లైంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది