సిద్దార్థ్
Actor ProfileActor

సిద్దార్థ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సిద్దార్థ్, నాగ చైతన్య, రాజ్ నిడిమోరు ... ముగ్గరితో సమంతను కలిపిన డైరెక్టర్ ఎవరో తెలుసా
Zee Telugu23 Jun 2026
సిద్దార్థ్, నాగ చైతన్య, రాజ్ నిడిమోరు ... ముగ్గరితో సమంతను కలిపిన డైరెక్టర్ ఎవరో తెలుసా

Samantha Love Stories: సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం మా ఇంటి బంగారం విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఆకట్టుకునే కలెక్షన్లు సాధిస్తోంది. మరోవైపు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో తరచుగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సమంతతో దర్శకురాలు నందిని రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటివరకు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మూడు సినిమాలు చేసింది. అవి జబర్దస్త్, ఓ బేబీ, మా ఇంటి బంగారం. ఈ మూడు చిత్రాలు కేవలం విజయాల పరంగానే కాదు, సమంత వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన దశలతో కూడా అనుబంధం కలిగి ఉండటం విశేషం. మొదటగా జబర్దస్త్ సినిమా విషయానికి వస్తే, ఆ సమయంలో సమంత మరియు నటుడు సిద్ధార్థ్ మధ్య ప్రేమ వ్యవహారం గురించి వార్తలు బాగా వినిపించేవి. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే ప్రచారం ఉన్న సమయంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే ఈ చిత్రం సమంత జీవితంలో ఒక ప్రత్యేక దశను గుర్తు చేస్తుందని అభిమానులు భావిస్తుంటారు. ఆ తర్వాత వచ్చిన ఓ బేబీ చిత్రం కూడా సమంత కెరీర్‌లో ఎంతో ముఖ్యమైనది. ఈ సినిమా విడుదలైన సమయంలో సమంత, నాగచైతన్య వివాహ బంధంలో ఉన్నారు. పెళ్లి తర్వాత సమంత నటిగా మరింత గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ఓ బేబీ ఒకటి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సమంత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక తాజాగా వచ్చిన మా ఇంటి బంగారం చిత్రం కూడా మరోసారి చర్చకు కారణమైంది. ఈ మధ్యనే సమంత.. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. పెళ్లయిన వెంటనే భర్త సమర్పణలో సమంత నటించడంతో అభిమానుల