స్థానిక సంస్థల ఎన్నికలు
Actor ProfilePolitician

స్థానిక సంస్థల ఎన్నికలు

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources5
స్థానిక సమరానికి సై అంటున్న ఏపీ.. ఎన్నికలసంఘం కీలకనిర్ణయం
Oneindia Telugu28 Dec 2026
స్థానిక సమరానికి సై అంటున్న ఏపీ.. ఎన్నికలసంఘం కీలకనిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా పైన క్లారిటీ ఇచ్చింది. 2025 నాటికి ప్రత్యేక సంక్షిప్త

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. 2025 నాటి ఓటర్ల జాబితాతోనే ఎలక్షన్స్
Samayam Telugu27 Dec 2026
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. 2025 నాటి ఓటర్ల జాబితాతోనే ఎలక్షన్స్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అక్టోబర్‌లో ఈ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తుది ఓటర్ల జాబితాలతో కాకుండా.. 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 3న సర్ తుది ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు ప్రచురిస్తే ఎన్నికల నిర్వహణ జాప్యమవుతోందని భావిస్తున్నారు. ఈ కారణంతో 2025 నాటి జాబితాలతోనే ఎలక్షన్స్‌కి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈ మేరకు ముందుగా పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు ఓటరల్ జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పుర, నగరపాలక,నగర పంచాయతీల్లో.. ఆ తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆశావాహులంతా సన్నద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.ఇక స్థానాల రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందంటేనే ఎన్నికలు సమీపించాయని అర్థం అంటూ అధికారులు చెబుతున్నారు. దాంతో ఓటర్ల జాబితా ప్రచురణపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3లోగా, ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఈ నెల 17వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి సంబంధించిన పబ్లికేషన్ ప్రక్రియ కూడా ఈ నెల 21 నుంచి 31లోగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు ఏర్పాట్లు కూడా

బోండా ఉమ కు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు
Oneindia Telugu16 Dec 2026
బోండా ఉమ కు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు

విజయవాడ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- టీడీపీ నేతల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలు తమ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. కూటమి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ విడుదల
Samayam Telugu13 Dec 2026
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేసింది

ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా
Oneindia Telugu13 Dec 2026
ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి

విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ
Oneindia Telugu9 Oct 2026
విపక్షాల్ని తుడిచిపెట్టేస్తున్న విజయ్- టీవీకేలోకి భారీగా కీలక నేతల క్యూ

తమిళనాడు రాజకీయ రంగంలో అనూహ్యమైన మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) వైపునకు

పార్టీ కోసం పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించం
Andhra Jyothy22 Sept 2026
పార్టీ కోసం పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించం

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమే గెలువబోతోందని

అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ
TeluguOne27 Aug 2026
అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ

వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు గీత దాటారు. ప్రత్యర్థులపై బూతుల పంచాగంతో విరుచుకుపడటమే కాకుండా, పలు కబ్జాలు, దాడుల కేసులలో కూడా

హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్
TeluguOne5 Jul 2026
హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా వార్తల్లో

ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా
10TV Telugu1 Jun 2026
ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా

AP Local Fight: యస్. ఇట్స్ టైమ్‌ టు లోకల్ ఫైట్. గెలిచి నిలవాల్సిందే. పట్టు నిరూపించాల్సిందే. క్లీన్‌ స్వీప్ చేయాల్సిందే. ఏపీలో స్థానిక పోరుపై ఎవరి లెక్కలు వారికున్నాయ్. ఇంకో నెల రోజుల్లో స్థానిక సమరం స్టార్ట్ కానుండటంతో..పార్టీలు ఇప్పటి నుంచే ఎవరి ఎత్తుల్లో వాళ్లు బిజీగా ఉన్నాయి. కూటమిలో ఆ మూడు పార్టీల ప్లానింగ్స్ ఏంటి? విపక్షంలో ఉన్న వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేనా? ఏకగ్రీవాలకు చెక్ పెట్టగలదా? ఏపీ పాలిటిక్స్‌లో స్థానిక ఎన్నికల హడావుడి హీట్‌ను పెంచుతోంది. సీఎం చంద్రబాబు..అటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్..ఇటు వైసీపీ అధినేత జగన్‌ స్టేట్‌మెంట్స్‌తో.. ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ మూమెంటమ్‌ స్పీడప్ అవుతోంది. ఇంకో ఒకటి, రెండు నెలల్లో లోకల్ ఫైట్‌కు సర్వం సిద్ధం చేస్తోంది సర్కార్. కలెక్టర్ల సదస్సు, రివ్యూలతో స్టేట్‌ ఈసీ బిజీ అయిపోయింది. ప్రభుత్వ పరంగానే కాదు ఇటు కూటమి పార్టీలు..విపక్ష వైసీపీ కూడా స్థానిక ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయ్. ఆల్రెడీ మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మరోవైపు స్థానిక ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని నేతలను హెచ్చరించిన ఆయన..అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యే స్థాయి లీడర్లకు అప్పగించారు. గ్రామ స్థాయిలో బలం పెంచుకునే యోచనలో అటు బీజేపీ, ఇటు జనసేన పావులు కదుపుతున్నాయి. ఇటు పార్టీ అగ్రనేతల కామెంట్స్..మరోవైపు ఎస్ఈసీ డెవలప్‌మెంట్స్‌తో..ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో టీడీపీ ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలుచుకున్న స్థానాలను తిరిగి కైవసం చేసుకుని పసుపు జెండా రెపరెపలాడించాలని పట్టుదలతో ఉంది. మహానాడు వేదికపైనా స్థానిక ఎన్నికలపై చర్చ జరిగింది. పార్టీ జెండా మోసిన వారికి పోటీ అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా టికెట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సంకేతాలిచ్చారాయన. ఇక ఇదే సందర్భంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కూడా స్థానిక ఎన్నికలపై గురిపెట్టారు. ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, ప్రతి స్థానంలోనూ పోటీ ఉండేలా అభ్యర్థులను ఇప్పటినుంచే రెడీ చేయాలని లీడర్లకు సూచించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ కాక రేక రేపుతోంది. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్యే గట్టి పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో జనసేన, బీజేపీకి సీట్లు కేటాయించిన చోట..పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది. 2021-22లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం స్థానాలను సొంతం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో 100 శాతం స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ యోచిస్తోంది. వైసీపీపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా కీలక స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉంది. ఆయా జిల్లాల నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కీలకమైన వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తమకు బలం ఉన్నచోట అభ్యర్ధులను పోటీలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలకు దూరంగా ఉండాలా..లేక పోటీ చేయాలా అనే డైలామాలో ఉన్న వైసీపీ ఇక అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అధికార పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ..స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు సర్వం సిద్దం చేస్తోందట. రాష్ట్రస్థాయి కీలక నేతల సమావేశంలో స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు జగన్‌. ముఖ్యంగా ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, అలా జరిగితే నియోజకవర్గ ఇంచార్జ్‌ల ఫెయిల్యూర్‌గా భావించాల్సి వస్తుందని ముఖ్యనేతలను హెచ్చరించారు. దీంతో స్థానిక పోరు విషయంలో తగ్గేదేలే అన్న ఇండికేషన్ పంపించారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 13 వేల 326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి న్యాయపరమైన చిక్కుల కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించ లేదు. ఇప్పుడు అన్ని పంచాయతీలకు ఎలక్షన్స్ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 660 జడ్పీటీసీ స్థానాలు, 10వేల 47కి పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ పెట్టనుండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. అలాగే రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రకారం 920కు వార్డుల సంఖ్య పెరిగింది. 75 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్‌ ఈసీ కసరత్తు చేస్తోంది. Also Read: మాట జారొద్దు, లైన్ దాటొద్దు.. దూకుడుగా వెళ్తున్న నేతలకు కేటీఆర్ క్లాస్?

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు
Andhra Jyothy1 Jun 2026
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వైసీపీ దుష్ట రాజకీయాలు

నంద్యాల, జూన్01: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏకగ్రీవమైందా.. పోస్టులు గోవిందా! ఇంచార్జిలకు జగన్ హెచ్చరికల వెనుక కారణాలేంటి
10TV Telugu29 May 2026
ఏకగ్రీవమైందా.. పోస్టులు గోవిందా! ఇంచార్జిలకు జగన్ హెచ్చరికల వెనుక కారణాలేంటి

Ys Jagan Warning: గెలవనీ.. ఓడనీ.. ఫలితం ఎలా అయినా ఉండనీ.. పోటీలో మాత్రం ఉండాల్సిందే ! ఏకగ్రీవం అయిందా ఊరుకోను. పోటీలో ఉండండి పోరాడండి. ఎక్కడైనా ఏకగ్రీవం అయిందా.. పోస్టులు ఊస్టు అయిపోతాయ్‌ జాగ్రత్త. ఇదీ నియోజకవర్గ ఇంచార్జిలకు జగన్ ఇచ్చిన వార్నింగ్‌.. ఈ రేంజ్‌లో అసలు వైసీపీ అధినేత హెచ్చరికలు ఎందుకు ఇచ్చినట్లు.. అసలు కారణాలు ఏంటి.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది.. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయ్‌. ఈ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని అటు అధికార కూటమి పార్టీలు.. ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయ్‌. ఎలాగైనా సరే.. స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయ్‌. స్థానిక ఎన్నికలను వైసీపీ మరింత సీరియస్‌గా తీసుకుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. గ్రౌండ్ లెవల్‌ కేడర్‌లో స్థైర్యం నింపాలన్నా.. జోష్‌ తీసుకురావాలన్నా.. లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాల్సిందే అని ఫిక్స్ అయింది. దీనికోసం పార్టీ నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు అధినేత జగన్‌. రెడీగా ఉండడం కాదు.. ఎక్కువ స్థానాలు గెలిచి తీరాల్సిందేనని టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో..స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నియోజకవర్గ ఇంచార్జిలకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు జగన్‌. ఎన్నికలు అయిపోయి రెండేళ్లయినా.. కొందరు నేతలు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో.. 34 మంది చోట్ల అసలు ఇంచార్జిలు అందుబాటులో ఉండటం లేదని ఫైర్ అయ్యారు. వీళ్లంతా పద్దతి మార్చుకోవాలని సూచించిన జగన్.. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ మీద పైచేయి సాధించాలని.. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక