
తెనాలి టౌన్: వివాహితపై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న దంపతులను అరెస్ట్ చేసినట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు, ఎస్సై కరిముల్లా తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. తెనాలికి చెందిన వివాహిత కడుపు నొప్పిగా ఉందనడంతో ఆమె భర్త ఈ నెల 3న స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్చాడు. ఆమె పక్క బెడ్ మీద ఉన్న గర్భిణి దుర్గ, భర్త చిన్నారావు వివాహితకు మాయ మాటలు చెప్పి ఈ నెల 4న తమతో చెరుకుపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని తమ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ అక్రమంగా నిర్బంధించి, భార్య దుర్గ సహాయంతో భర్త చిన్నారావు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన భార్య వైద్యశాలలో లేక పోవడం, పక్క బెడ్ వారితో కలిసి వెళ్లిందన్న సమాచారంతో భర్త సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు సేకరించి గొల్లపల్లి వెళ్లి భార్యను తెనాలి తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. చిన్నారావు, దుర్గలను అరెస్ట్ చేశారు. ఈ దంపతుల సొంత ప్రాంతం శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామం. కొన్నేళ్ల క్రితం వీళ్లు గొల్లపల్లి వచ్చి ఇక్కడ రొయ్యల చెరువులకు కాపాలా ఉంటున్నారు. చిన్నారావుపై శ్రీకాకుళం జిల్లాలో పోక్సో, దొంగతనాల కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు





