
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై, పిల్లలపై ఆమె ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని, ప్రేమను వ్యక్తం చేసింది. దీనికి ఓ కారణం ఉంది. “నా బాల్యం అంత ఆనందదాయకంగా సాగలేదు. మంచి బాల్యం పొందని పెద్దలంతా ఒకటే ఆలోచిస్తారు. తమ పిల్లలకు అలాంటి మంచి బాల్యాన్ని అందించాలనుకుంటారు. నాలో కూడా ఆ గుణం నాటుకుపోయింది. నాకు బిడ్డ పుడితే, ఆ బిడ్డే నా సర్వస్వం అవుతుంది.” గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత స్పందన ఇది. సింగిల్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె పిల్లలపై, మాతృత్వంపై స్పందించింది. సిటాడెల్ హనీబన్నీ ప్రచారంలో మాట్లాడుతూ…ఆమె మాతృత్వంపై తన మమకారాన్ని వెల్లడించింది. “తల్లి కావాలని ఎప్పుడూ కలలుకన్నాను. అదొక పరిపూర్ణమైన అనుభూతి, మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావించాను. కానీ అది ఇంకా సాధ్యం కాలేదు. అయితే మాతృత్వానికి వయసు అడ్డంకి కాదు. ఏ దశలోనైనా అదొక అద్భుతమైన ప్రయాణం.” ఇన్నాళ్లకు సమంత ఆ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టింది. 39 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చింది. గతేడాది చివర్లో రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత, ఈసారి ఎక్కువ గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. కొన్ని నెలలకే గర్భం దాల్చింది. ఈ ఏడాది చివరి నాటికి బిడ్డకు జన్మనివ్వబోతోంది




