
Nikhil Chaudhary Australia Debut: భారత గడ్డపై పుట్టి, కంగారూల దేశంలో క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలడం అంటే సామాన్యమైన విషయం కాదు. తాజాగా ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత ప్రయాణం ప్రతి ఒక్క క్రీడాభిమానికి స్ఫూర్తిని నింపుతోంది. చరిత్ర సృష్టించిన నిఖిల్ చౌదరి.. ఎలైట్ లిస్ట్‌లో చోటు! ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్‌లో పుట్టి, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో క్రికెటర్‌గా ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ (Playing XI) లో నిఖిల్‌కు చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన కంగారూలు, ఈ టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ కీలక సమయంలో నిఖిల్ చౌదరి జట్టులోకి రావడం విశేషం. కాగా, తొలి మ్యాచ్‌లోనే ఇటు బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి, అటు బ్యాటింగ్‌లో కీలకమైన 18 పరుగులతో ఆకట్టుకున్నాడు. గతంలో గుజరాత్లో జన్మించిన రెక్స్ సెల్లర్స్, పుణేలో జన్మించిన మహిళా క్రికెట్ దిగ్గజం లిసా స్థాలేకర్ మాత్రమే భారత్ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాకు ఆడారు. ఇప్పుడు వారి సరసన నిఖిల్ చేరి ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఎలైట్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాడు. పంజాబ్ నుంచి ఆస్ట్రేలియా దాకా.. ఒక సినిమా లాంటి ప్రయాణం.. ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. భారత్‌లో ఉన్నప్పుడు అతను పంజాబ్ స్టేట్ టీమ్ తరఫున 14 లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. ఆ సమయంలో హర్భజన్ సింగ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి నిఖిల్ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. ఐపీఎల్ (IPL) లో ముంబై