ఫీజు బకాయిల
Actor ProfilePolitician

ఫీజు బకాయిల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
Sakshi18 Aug 2026
ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

సోమవారం ఘట్‌కేసర్‌లో వికసిత్‌ భారత్‌ స్టూడెంట్స్‌ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతున్న నితిన్‌ నబీన్‌ మన జెన్‌–జీ రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం ఏ విషయంలోనూ సత్వర మార్గాలు వద్దు.. జీవితం ఒక సుదీర్ఘ పరుగు ఇది 100 మీటర్ల పరుగు పందెం కాదు.. ఇది ఓపికకు పరీక్ష వికసిత్‌ భారత్‌ స్టూడెంట్స్‌ కాన్‌క్లేవ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సాక్షి, హైదరాబాద్‌/ఘట్‌కేసర్‌: ‘తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌ వీబీఐటీ క్యాంపస్‌లో ‘వికసిత్‌ భారత్‌ స్టూడెంట్స్‌ కాన్‌క్లేవ్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్‌–భవిష్యత్‌ సవాళ్లు, 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలన తదితర అంశాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్‌ నబీన్‌ సమాధానమిచ్చారు. మన యువతది తుక్‌డే తుక్‌డే మైండ్‌సెట్‌ కాదు ‘ఇతర దేశాల్లో సాగుతున్న జెన్‌–జీ ఉద్యమాలను అందిపుచ్చుకోవాలంటూ కొన్ని రాజకీయశక్తులు మన దేశంలోని యువతను రెచ్చగొడుతున్నాయి. కానీ భారత్‌లోని జెన్‌–జీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కాదు. మన యువత అరాచకాలను విశ్వసించదు. ఇది రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం.. వారిది తుక్‌డే తుక్‌డే మైండ్‌సెట్‌ కాదు. యువ భారతీయులు దేశాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్‌ భారతానికి వారి వంతు కృషి చేస్తున్నారు’ అని నితిన్‌ నబీన్‌ పేర్కొన్నారు. ‘జీవితానికి అడ్డదారులు ఉండవు... యువత, విద్యార్థులు ఏ విషయంలోనూ సత్వర మార్గాలు ఎంచుకోవద్దని.. జీవితానికి అడ్డదారులు ఉండవని నితిన్‌ నబీన్‌ సూచించారు. ‘జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు. ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు. ఇది ఓపికకు పరీక్ష’ అని వివరించారు. జీవితంలో