
గ్రామ పంచా యతీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ (బహుళ ప్రయోజ క) విధానం వల్ల కార్మికులు పని ఒత్తిడికి గురవుతు న్నారు. ఒకే వ్యక్తితో పలు రకాల పనులు చేయిస్తు న్నారని ఆవేదన చెందుతున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి విభిన్న బాధ్యతలను ఒకే కార్మికుడిపై మోపడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. - బాధ్యతలు పెరిగినా అరకొర వేతనాలేనని ఆవేదన కెరమెరి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచా యతీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ (బహుళ ప్రయోజ క) విధానం వల్ల కార్మికులు పని ఒత్తిడికి గురవుతు న్నారు. ఒకే వ్యక్తితో పలు రకాల పనులు చేయిస్తు న్నారని ఆవేదన చెందుతున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి విభిన్న బాధ్యతలను ఒకే కార్మికుడిపై మోపడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పల్లెల ప్రగతికి, ప్రజల అవసరాలను నిరం తరం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ, పన్నుల వసూలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించే పంచాయతీ కార్మికులు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి ఉద్యోగ భధ్రత, వేతనాల, సంక్షేమంపై ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. గ్రామ పంచాయ తీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ విధానం కార్మికులను ఇబ్బందుల్లోకి నెడుతోందని పలువురు కార్మికులు ఆ వేదన చెందుతున్నారు. ఒకే వర్కర్‌తో పారిశుధ్య పను లు, విద్యుత్ దీపాల మరమ్మతులు, పంపు ఆపరేటర్ పనులు చేయించటం వల్ల సాంకేతిక పరిజ్ఙానం లేక విద్యుత్ ఫ్రమాదాల బారిన పడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. హోదాల ప్రకారం పని విభజన చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేసి ఎవరి పని వారికి కేటాయించాలని కోరుతున్నారు. ఎలక్ట్రిషియన్, వాటర్ సప్లైయి
















