కల్యాణ లక్ష్మి
Actor ProfilePolitician

కల్యాణ లక్ష్మి

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources5
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బంద్.. అసలు కారణం ఏమిటి
Asianet News Telugu14 Dec 2026
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బంద్.. అసలు కారణం ఏమిటి

తెలంగాణలో పేద కుటుంబాల ఇంట్లో పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాల అమలుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పథకాల కింద లబ్ధిదారులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని స్పష్టం చేస్తూ తాత్కాలిక ఇంజక్షన్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అసలు హైకోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ పథకం పూర్తిగా నిలిపివేయనున్నారా? న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి అమలు చేస్తున్న ఈ పథకాలకు అసెంబ్లీలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదా తీర్మానం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ఆధారంగానే రూ.13,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 202(3), 204(3), 266(3), 283(2) నియమాలను ఉల్లంఘిస్తూ, చట్టసభల అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం తన చేతుల్లోకి తీసుకుందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. జూలై 8న సమయం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో కూడా ప్రభుత్వం తరఫు న్యాయవాది మరికొంత సమయం కోరడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో 2014 నుండి 2019 వరకు ఈ పథకాల కోసం జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ కేసు విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ పథకం ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. ఈ తాత్కాలిక ఇంజక్షన్ ప్రకారం, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు బిగ్ షాక్
Oneindia Telugu13 Dec 2026
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు బిగ్ షాక్

తెలంగాణలోని పేద మహిళలకు ఆర్థిక సాయం కోసం తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ రెండు పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ జరిపిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాలకు శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా.. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ ‌పై జస్టిస్ ఎన్. వీ. శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తీసుకొచ్చిన పథకాలకు నిధులు ఖర్చుచేయడం చెల్లదని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై గతంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధిస్తూనే.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. దాంతో తదుపరి విచారణ సెప్టెంబర్ 9 వ తేదీన జరగనుంది. తదుపరి విచారణ వరకు పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయరాదని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతులకు వివాహం సమయంలో ఆర్థిక సాయం చేయడం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాలను 2014 లో ప్రారంభించింది. ఆ తర్వాత వీటి పరిధిని బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం ఈ పథకాల కింద అర్హులైన ప్రతి యువతికి రూ. 1,00,116

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Telugu Times16 Oct 2026
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే

హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
Vaartha22 Jun 2026
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయిని

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ
Vaartha20 Jun 2026
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ

Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే

లో మృతి.. 2024లో వివాహం.. కల్యాణ లక్ష్మి కోసం నకిలీ పెళ్లి పత్రాలు
Vaartha20 Jun 2026
లో మృతి.. 2024లో వివాహం.. కల్యాణ లక్ష్మి కోసం నకిలీ పెళ్లి పత్రాలు

Bhadradri Kothagudem: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించి, ఆయా కుటుంబాలను అప్పుల పాలు కాకుండా ఆదుకోవాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్యాణ లక్ష్మి పథకాన్ని