కావ్య మారన్
Actor ProfileActor

కావ్య మారన్

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources3
కావ్య మారన్- అనిరుధ్ ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్
TV9 Telugu7 Aug 2026
కావ్య మారన్- అనిరుధ్ ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోననున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రిలేషన్ షిప్ రూమర్లపై అటు అనిరుధ్ కానీ, ఇటు కావ్య కానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఒక సందర్భంలో కావ్య గురించి మాట్లాడిన అనిరుధ్ తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అయినా వీరి పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే ప్రముఖ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ ఈ విషయంపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన అనిరుధ్, కావ్య మారన్ ల గురించి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘అనిరుధ్ ఎంతో మృదుస్వభావి. ప్రతిభావంతుడైన యువకుడు. పైగా చాలా మంచి వ్యక్తి. సాఫ్ట్ నేచర్ కలిగినవాడు. అయితే ఏదో ఒక కారణం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోందనిపిస్తోంది. త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. నేను విన్న సమాచారం బట్టి త్వరలోనే ఈ వివాహం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇద్దరూ చాలా మంచోళ్లు. అందమైన జంటగా కనిపించే వీరు మంచి దంపతులుగా కూడా పేరు తెచ్చుకుంటారు’ అని చెప్పుకొచ్చారు మహేంద్రన్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా మారన్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో ఆమె పేరు తెగ మార్మోగుతుంటుంది. ఇక అనిరుధ్ విషయానికి వస్తే సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నారు. అలాంటిది వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. మరిన్ని సినిమా

రాయలసీమ సమస్యలపై పోరాటం.. ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్... అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్
Samayam Telugu7 Aug 2026
రాయలసీమ సమస్యలపై పోరాటం.. ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్... అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’ (వర్కింగ్ టైటిల్) అధికారికంగా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్

అనిరుధ్-కావ్యల పెళ్లి నిజమే.. పుకార్లకు బలం చేకూర్చిన సీనియర్ నటుడు
AP7AM6 Aug 2026
అనిరుధ్-కావ్యల పెళ్లి నిజమే.. పుకార్లకు బలం చేకూర్చిన సీనియర్ నటుడు

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) అధినేత కావ్య మారన్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు

చివరి షెడ్యూల్ లో సంబరాల ఏటి గట్టు’… హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ సెట్
Samayam Telugu6 Aug 2026
చివరి షెడ్యూల్ లో సంబరాల ఏటి గట్టు’… హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ సెట్

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటి గట్టు’. ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన నిర్మాతలు కె. నిరంజన్

అనిరుధ్ -కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్?.. బంధాన్ని కన్ఫార్మ్ చేసిన అఖండ 2’ నటుడు
Samayam Telugu6 Aug 2026
అనిరుధ్ -కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్?.. బంధాన్ని కన్ఫార్మ్ చేసిన అఖండ 2’ నటుడు

కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అధినేత కావ్యా మారన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూస్తోన్న సంగతి

వండర్ కిడ్ వైభవ్ కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత వైరల్ అవుతున్న వీడియో
TV9 Telugu29 May 2026
వండర్ కిడ్ వైభవ్ కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత వైరల్ అవుతున్న వీడియో

Watch : ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కో-ఓనర్ కావ్య మారన్ చేసిన ఒక అద్భుతమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దగ్గరకు స్వయంగా వెళ్లి అభినందించారు. తన జట్టును ఓడించిన ప్రత్యర్థి ఆటగాడనే కక్ష లేకుండా, ఆ చిన్నారి చూపించిన అసాధారణ ప్రతిభను కావ్య మారన్ మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బుధవారం జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 97 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం మూడు పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయినప్పటికీ, అతను ఆడిన ఈ మ్యాచ్ విన్నింగ్ నాక్ రాజస్థాన్ రాయల్స్ జట్టును క్వాలిఫైయర్ రేసులోకి తీసుకెళ్లింది. ఈ చిన్నారి విధ్వంసానికి ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్ సైతం ఫిదా అయిపోయింది. మ్యాచ్ అనంతరం కావ్య మారన్ వైభవ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి, వెన్నుతట్టి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏకంగా 65 సిక్సర్లు, 55 ఫోర్లతో 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో కొనసాగుతున్నాడు. 242 ఎగ్రెసివ్ స్ట్రైక్