
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. england vs croatia: ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీలో గ్రూప్-L మొదటి మ్యాచ్‌లోనే ఫుట్‌బాల్ ప్రియులకు అసలైన మజా లభించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో క్రొయేషియాపై 4-2 తేడాతో ఇంగ్లాండ్ సంచలన విజయం సాధించింది. 2018 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌తో పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది. మొత్తం 6 గోల్స్ నమోదైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్‌తో చెలరేగగా, యువ తారలు జూడ్ బెల్లింగ్‌హామ్, మార్కస్ రాష్‌ఫోర్డ్ చెరొక గోల్‌తో ఇంగ్లాండ్‌కు 3 పాయింట్లు తెచ్చిపెట్టారు. మ్యాచ్ 12వ నిమిషంలోనే తీవ్ర నాటకీయత చోటుచేసుకుంది. క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్ ఒత్తిడిలో నోని మడుయెకేను కింద పడేయడంతో రిఫరీ ఇంగ్లాండ్‌కు పెనాల్టీ ఇచ్చాడు. హ్యారీ కేన్ కొట్టిన మొదటి కిక్‌ను క్రొయేషియా కీపర్ లివాకోవిచ్ అడ్డుకున్నప్పటికీ.. కిక్‌కు ముందే డిఫెండర్ జోస్కో గార్డియోల్ డి-ఏరియాలోకి రావడంతో రిఫరీ మళ్లీ అవకాశం ఇచ్చాడు. ఈసారి కేన్ ఎలాంటి తప్పు చేయకుండా బంతిని గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 36వ నిమిషం: లూకా సుకిచ్ అద్భుతమైన డ్రిబ్లింగ్‌తో ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించి ఇచ్చిన పాస్‌ను మార్టిన్ బటురినా గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు. 42వ నిమిషం : డెక్లాన్ రైస్ వేసిన పర్ఫెక్ట్ కార్నర్ కిక్‌ను హ్యారీ కేన్ గాల్లోకి లేచి సూపర్ హెడర్‌తో గోల్ చేసి ఇంగ్లాండ్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఫస్ట్ హాఫ్ ఇంజూరీ టైమ్ : హాఫ్ టైమ్‌కు ముందే ఇంగ్లాండ్ డిఫెన్స్ పొరపాటును వాడుకున్న పీటర్ మోసెస్ఒక అద్భుతమైన వాలీ షాట్‌తో గోల్