కోట్ల ఇల్లు
Actor ProfileCelebrity

కోట్ల ఇల్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట్ల ఇల్లు, ప్రైవేట్ జెట్.. మహేష్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా
Asianet News Telugu19 Nov 2026
కోట్ల ఇల్లు, ప్రైవేట్ జెట్.. మహేష్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా

మహేష్ బాబు తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని విలాసవంతమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఓ ఖరీదైన భవనం ఉంది. మీడియా కథనాల ప్రకారం, దీని విలువ సుమారు రూ. 28 కోట్లు. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఓపెన్ గార్డెన్, విశాలమైన లివింగ్ ఏరియాలు ఉన్నాయట. అంతేకాదు, మహేష్ బాబుకు సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీన్ని ఆయన వృత్తిపరమైన పనులకు, కుటుంబ పర్యటనలకు వాడుతుంటారు. ఇక ఆయన క్యారవాన్ 'కారవాన్' విలువ రూ. 6.2 కోట్లు. ఇందులో బెడ్‌రూమ్, ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, మీటింగ్ స్పేస్, లగ్జరీ రెస్ట్‌రూమ్ వంటివి ఉన్నాయి. మహేష్ బాబుకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఆయన వద్ద రూ. 1.8 కోట్ల విలువైన ఆడి ఆర్8, రూ. 2.1 కోట్ల రేంజ్ రోవర్ వోగ్, రూ. 92 లక్షల టయోటా ల్యాండ్ క్రూయిజర్, రూ. 2.8 కోట్ల లంబోర్ఘిని గల్లార్డో ఉన్నాయి. వీటితో పాటు రూ. 82.08 లక్షల మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్, రూ. 1.19 కోట్ల ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఉన్నట్లు సమాచారం. సూపర్ స్టార్ ఒక్కొక్క సినిమాకు 100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆస్తుల విలువ 500 కోట్లకుపైనే ఉంటుందని సమాాచారం. ఇక సినిమాల విషయానికొస్తే, మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాతో ఫుల్ బిజీగాఉన్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న సినిమా ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి రానుంది