
చిత్ర పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఒక నటుడిగా నిరూపించుకునే అవకాశం నాకు ‘నాగబంధం’తో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశాను’ అన్నారు నటుడు విరాట్ కర్ణ. ఆయన హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కర్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → ఇప్పటి వరకు నేను చేసిన రెండు సినిమాలు(పెద కాపు, నాగబంధం) భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. కెరీర్ ప్రారంభంలోనే ఇంత భారీ సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను. → అభిషేక్ నామా ‘నాగబంధం’ కథను సిద్ధం చేసుకుని, ఆ పాత్రకు తగ్గ నటుడి కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిపించి మాట్లాడారు. నాకు కథ చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యాను. అలా నాగబంధం జర్నీ మొదలైంది. తొలుత తక్కువ బడ్జెట్‌తోనే తీద్దాం అనుకున్నాం. సినిమా డెవలప్ చెందుతున్న కొద్దీ కంటెంట్ డిమాండ్ ప్రకారం బడ్జెట్ సైజ్ పెరుగుతూ రూ. 100 కోట్ల బడ్జెట్‌కి వచ్చింది. → నాగబంధం కథ విన్నప్పుడే నా పాత్ర ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. రుద్ర











