ఈసారి నిర్జల ఏకాదశి ఎప్పుడు? కచ్చితమైన తేదీ, పూజా విధానం, ఆధ్యాత్మి విశిష్టత
Actor ProfileCelebrity

ఈసారి నిర్జల ఏకాదశి ఎప్పుడు? కచ్చితమైన తేదీ, పూజా విధానం, ఆధ్యాత్మి విశిష్టత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈసారి నిర్జల ఏకాదశి ఎప్పుడు? కచ్చితమైన తేదీ, పూజా విధానం, ఆధ్యాత్మి విశిష్టత గురించి తెలుసుకోండి
Samayam Telugu4 Jul 2026
ఈసారి నిర్జల ఏకాదశి ఎప్పుడు? కచ్చితమైన తేదీ, పూజా విధానం, ఆధ్యాత్మి విశిష్టత గురించి తెలుసుకోండి

జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి తేదీ జూన్ 24వ తేదీ బుధవారం సాయంత్రం 6:13 గంటలకు నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం కానుంది. ఆ తర్వాత మరుసటి రోజు జూన్ 25న గురువారం రాత్రి 8:10 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభం : జూన్ 24న బుధవారం సాయంత్రం 6:13 గంటలకు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి ముగింపు: జూన్ 25 గురువారం రాత్రి 8:10 గంటలకు నిర్జల ఏకాదశి 2026: జూన్ 25, గురువారం * నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. * ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది. * ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. * అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది. * నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో, తులసి మాలతో అలకరించి పూజించాలి. * పూజా సమయంలో పండ్లు సమర్పించి, తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి. తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి కథను హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మముహుర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు