
బూర్గంపహాడ్, జూన్ 19 : ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్ధేశిస్తూ బాడీ షేమింగ్ చేయడం, హేళనగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ నాయకుడు కేవీ రమణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గురుకుల విద్యావ్యవస్థ నుండి పేద విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిన విద్యావేత్త, లక్షలాది పేద విద్యార్ధులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య, ఉపాధి అవకాశాలు అందించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా దేశ భద్రతలో ఐపీఎస్ అధికారిగా సైతం విశిష్ట సేవలు అందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సీఎం వ్యక్తిగతంగా ఇలా దూషించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. రేవంత్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు


