
కమలాపురం: కమలాపురం మండలం భారతి సిమెంట్ పరిశ్రమ వద్ద 19వ రోజు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులు వారి తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం తక్షణమే తొలగించిన 28 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.