© 2026 nimisham.in

Jyoti Malhotra: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి చుక్కెదురైంది. పాకిస్థాన్ నిఘా సంస్థల ప్రతినిధులకు భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే మరికొన్నాళ్లు గడపాల్సి రానుంది. Read also: Kerala Weather Update: కేరళలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, జ్యోతి మల్హోత్రాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేసింది.
Jyoti Malhotra: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి చుక్కెదురైంది. పాకిస్థాన్ నిఘా సంస్థల ప్రతినిధులకు భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే మరికొన్నాళ్లు గడపాల్సి రానుంది.
Read also: Kerala Weather Update: కేరళలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, జ్యోతి మల్హోత్రాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలోనే పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నిందితురాలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లోనే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూనే జ్యోతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హర్యానా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో జ్యోతిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ (1923)తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠిన సెక్షన్లను నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఆమె ‘ట్రావెల్ విత్ జో’ (Travel with Jo) అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తోంది. తన పాకిస్థాన్ పర్యటనల సమయంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారి ఎహసాన్-ఉర్-రహీంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో సోషల్ మీడియా ద్వారా పలువురు పాక్ నిఘా ఏజెంట్లతో కనెక్ట్ అయ్యింది. భారతదేశంలోని కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలైన పాండో డ్యామ్, మున్నాబావో రైల్వే స్టేషన్, సీఆర్పీఎఫ్ (CRPF) క్యాంపులకు సంబంధించిన రక్షణ సమాచారాన్ని, వీడియోలను, ఫోటోలను వారికి చేరవేసింది. అంటూ పోలీసులు ఆరోపించారు.
తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని, దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ కూడా దాఖలైనందున తనకు బెయిల్ ఇవ్వాలని జ్యోతి కోర్టులో వాదించింది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ వాదనలను గట్టిగా తిప్పికొట్టింది. జ్యోతి పాక్ ఏజెంట్లతో నిరంతరం రహస్యంగా మాట్లాడిందని, పట్టుబడకుండా ఉండేందుకు చాట్ హిస్టరీని కూడా డిలీట్ చేసిందని సిట్ ఆధారాలను కోర్టు ముందుంచింది. 2025 మే 16న హిసార్‌లో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి జ్యోతి కస్టడీలోనే ఉంది. గతేడాది ఆగస్టులోనే సిట్ ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 2,500 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.
Revanth Reddy: ఏపీతో నీటి చర్చలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Bolla Brahmanaidu: తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Kerala Weather Update: కేరళలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
Ebola Virus: జైపూర్‌లో ఉగాండా మహిళకు ఎబోలా వైరస్ !
RBI key decisions: విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
Annamalai’s departure: అన్నామలై నిష్క్రమణతో పార్టీకి నష్టం లేదు: తమిళనాడు బీజేపీ
UNO Rules: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలు: పాక్ పదవీకాలం ముగింపు
Trump a ‘messenger of peace’: ట్రంప్ ను శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్..నిధుల కోసం కొత్త డ్రామా