
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Yash Fan Death: కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. తన అభిమానుల విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ విషాద ఘటనలో ఓ అభిమాని అంత్యక్రియలకు ఆయన హాజరు కాకపోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై యశ్ స్పందించడంతో అసలు కారణం ఏమిటనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2021లో యశ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చివరి కోరికగా తన అంత్యక్రియలకు యశ్, అప్పటి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య అంత్యక్రియలకు వెళ్లగా.. యశ్ మాత్రం అక్కడికి వెళ్లలేదు. అభిమాని అంత్యక్రియలకు హీరో హాజరు కాకపోవడంతో అప్పట్లో యశ్‌పై కొందరు విమర్శలు చేశారు. తనను ఎంతో అభిమానించిన వ్యక్తి చివరి కోరికను కూడా ఆయన నెరవేర్చలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఈ నిర్ణయం వెనుక మరో కారణం ఉందని యశ్ తాజాగా వెల్లడించారు. అభిమాని మరణం తనను తీవ్రంగా కలచివేసిందని యశ్ తెలిపారు. అయితే అభిమానాన్ని చాటుకునేందుకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకుంటే, తాను అతని అంత్యక్రియలకు వెళ్లడం సరైన సందేశాన్ని ఇవ్వదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను అక్కడికి వెళ్తే తన కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే మరికొందరికి అది ప్రోత్సాహంగా మారే ప్రమాదం ఉందని భావించినట్లు చెప్పారు. అభిమానులు తనను