
ఆమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్ డ్రాతో మొదలుపెట్టింది. ఆదివారం పూల్-డిలో బలమైన చైనాతో జరిగిన మ్యాచ్‌ను సలీమా బృందం 2-2తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (8వ నిమిషం) తొలి గోల్ చేసింది. తొలి క్వార్టర్ ముగుస్తుందనగా చైనా స్కోరును సమం చేసింది. జాంగ్ యింగ్ 14వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేయడంతో స్కోరు సమం అయింది. రెండో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్‌ను దీపిక (26వ నిమిషం) గోల్‌గా మలవడంతో భారత్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది. చైనా క్రీడాకారిణి మా నింగ్ 39వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌తో గోల్ చేయడంతో స్కోరు మళ్లీ సమం అయింది. చివరి క్వార్టర్లో ఇరుజట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ హవా సాగింది
.