© 2026 nimisham.in

IND vs PAK Pakistan Captain Fatima Sana : మహిళల ఆసియా కప్- 2026లో భారత్-పాకిస్థాన్ మధ్య శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత ఓపెనర్ షెఫాలీ వర్మను ఔట్ చేసిన తరువాత పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఇచ్చిన ‘సెండ్-ఆఫ్’ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. షెఫాలీని ఔట్ చేసిన వెంటనే ఆమెకు డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాలంటూ ఫాతిమా సైగ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : INDW vs PAKW : పాక్ బ్యాటర్లకు చుక్కలు.. 8.4 ఓవర్లలోనే భారత్ విక్టరీ!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు పరుగుల రాబట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. భారత్ స్పిన్నర్ల ధాటికి కేవలం 55 పరుగులకే పాకిస్థాన్ జట్టు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపు ఆరంభం ఇచ్చింది. ఇన్నింగ్స్ తొలి బంతినే లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్‌గా మలిచింది.

షెఫాలీ ఆరు బంతుల్లో 12 పరుగులు చేసింది. అయితే, నాలుగో ఓవర్లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ చేయగా.. ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి షెఫాలీ ఔట్ అయింది. అయితే, క్యాచ్ అందుకున్న ఫాతిమా సనా.. షెఫాలీకి ఇచ్చిన సెండ్-ఆఫ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఆమె చర్యను విమర్శించగా.. మరికొందరు క్రికెట్లో ఇలాంటి పోటీ భావోద్వేగాలు సహజమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 3,000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆమె 22 ఏళ్ల 220 రోజుల వయసులో ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా అత్యంత తక్కువ బంతుల్లో ఈ మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది.

pic.twitter.com/Aal8mraaCd

— pctstorage (@pctstorage_) September 5, 2026