
వృషభ రాశి స్త్రీలు ఎంతో సాధారణంగా ఉంటారు. వారు కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరిలో ప్రేమ, ఆప్యాయత, అందం, సంబంధాలకు విలువ ఇచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు పెళ్లి తర్వాత భర్త అవసరాలు అడగకుండానే అర్థం చేసుకుంటారు. కుటుంబాన్ని చక్కగా నడిపించడంలో వీరు నిష్ణాతులు. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మానసికంగా సపోర్ట్‌గా ఉంటారు. భర్త ఆర్థిక ఎదుగుదల కోసం ఉపయోగపడే సలహాలు ఇస్తారు. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ప్రేమ, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ స్త్రీలకు కుటుంబంపై చాలా శ్రద్ధ ఉంటుంది. భర్త పని ఒత్తిడిలో ఉన్నా, మానసిక ఒత్తిడికి గురైనా దాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. భర్తకు ఓదార్పుగా ఉండటం వీరి ప్రత్యేకత. ఇంట్లో అందరినీ ఒకటిగా కలిపి ఉంచే శక్తి కూడా వీరికి ఉంది. సింహ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని భావిస్తారు. పెళ్లి తర్వాత భర్త ఎదుగుదలని తమ సొంత ఎదుగుదలగానే భావిస్తారు. భర్త కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా కొత్త బాధ్యత స్వీకరించినా, అతనికి ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుంటారు. కుటుంబ గౌరవాన్ని, భర్త ప్రతిష్ఠను కాపాడాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉండొచ్చు
.