
కల్కి 2 (Kalki 2) సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) స్వయంగా చెప్పాడు పది రోజులకు మించి ఇప్పటివరకు షూటింగ్ జరగలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను అన్నాడు. ఎందుకంటే ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి చేసిన తర్వాత “కల్కి 2” షూటింగ్ మళ్ళీ మొదలు అవుతుంది ప్రభాస్ కి సంబంధించినంతవరకు. అంటే వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఈ గ్యాప్ లో నాగ్ అశ్విన్ దీపిక పదుకోన్ స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోవాలి. దీపిక మొదటి భాగంలో నటించింది. రెండో భాగంలో మాత్రం నటించడం లేదు. ఆమె అడిగిన అధిక పారితోషికం, డిమాండ్ల వల్ల ఆమెని కొనసాగించడం లేదు. రెండో భాగంలో దీపిక ఉండదు అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఆమె పోషించిన సుమతి పాత్రని సాయి పల్లవి (Sai Pallavi) పోషిస్తుంది అని అంటున్నారు. కానీ సాయి పల్లవి ఇంకా సైన్ చెయ్యలేదు. నిర్మాతలకు డేట్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అందుకే ఆమెని ఇంకా అఫీషియల్ గా తీసుకోలేదు. ఫైనల్ గా దీపిక స్థానంలో సాయి పల్లవి ఉంటుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగుతుంది. ఈ గ్యాప్ లో ఆమె ధనుష్ హీరోగా రూపొందుతోన్న “ఓం” చిత్రం, రణబీర్ కపూర్ రాముడిగా, తాను సీతగా నటించిన ‘రామాయణం’ మొదటి భాగం చిత్రాన్ని విడుదల చేసుకొని వస్తుంది
.