
కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. పట్టణ జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యా లు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే భూమి కేటాయించారు. ఆ భూములు ఇంకా ఖాళీగానే ఉంటున్న కూడా డిపో ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు పడడం లేదు. కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. పట్టణ జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యా లు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే భూమి కేటాయించారు. ఆ భూములు ఇంకా ఖాళీగానే ఉంటున్న కూడా డిపో ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు పడడం లేదు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో కోసం గతంలోనే బస్సు స్టేషన్ పక్కన స్థలం కేటాయించారు. కానీ నేటికి కూడా బస్ డిపో ఏర్పాటు కోసం నిధులు కానీ కార్యాచరణ కానీ ముందుకు సాగడం లేదు. కుమరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు నేటికి కూడా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఉన్నప్పటికీ కాగజ్‌న గర్ డివిజన్లో ఉన్న ఏడు మండలాలైన సిర్పూర్ (టి). బెజ్జూరు, కౌటా ల, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్పేటతో పాటు కాగజ్‌నగర్ మండలాల్లోని పలుమారుమూల ప్రాంతాలకు నేటికి బస్సు సౌకర్యం లేదు. వీటిలో అటవీ గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసి బస్సు సౌకర్యం కాదుకదా కనీసం బస్సు షెల్టర్స్, బస్సు స్టేషన్ల నిర్మాణం కూడా కొన్ని మండల కేంద్రాల్లో దశాబ్దాలుగా జరగలేదు. ఒక్క కౌటాల మినహా సిర్పూర్ (టి), బెజ్జూరు, దహెగాంలతో పాటు కొత్త మండలాల్లో బస్సు స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అయినా గత ప్రభుత్వా లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు న్నాయి. ఇందుకు